పరిమళాలు

14, జనవరి 2013, సోమవారం

తేట తెలుగు వెలుగులు

తెలుగు భాష నాది తెలుగు వాడను  నేను
తెలుగు పలుకు మంచి తేన చినుకు
మాతృభాష కలిమి మనుగదకు చెలిమి
తెలిసి చదువు బాల తెలుగు  లీల

మల్లెపూవు కంటే మంచి గంధముకంటే
పంచదార కంటే పాలకంటే
తెలుగు భాషలెస్స  దేశభాషలలో సం
గీత  భాష తెలుగజాతి భాష

వీణ తీగ మీటి వినిపించినట్లుగ 
వినగసొంపు గొలుపు తెలుగు పలుకు,
తెలుగు పలుకులందు తేనెలూరుచునుండు, 
భవ్య సుగుణ శీల భరత బాల. 
    

5 కామెంట్‌లు:

  1. భవ్య సుగుణ శీల భరత బాల... ఈ మకుటం ఉన్న శతకం రాసినదెవరో తెలిస్తే చెప్పండి ప్లీజ్...!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వీణతీగ మీటి వినిపించినట్లుగ
      వినగ సొంపు గొలుపు తెలుగు పలుకు
      తెలుగు పలుకులందు తేనెలూరుచునుండు
      భవ్యసుగుణ శీల భరతబాల....
      ============
      ఈ పద్యశతక కర్త ఎవరు...? తెలుపగలరు.. శతకము పేరు "సుగుణశీల శతకమా?" లేక వేరే ఏదైనా ఉన్నదా...?
      My cell No. 9010619066... www.maddiralasreenivasulu.blogspot.in www.baalavikaasam.blogspot.in

      తొలగించండి
  2. భవ్య సుగుణ శీల భరతబాల శతక కర్త పేరు తెలియ జేయగలరు

    రిప్లయితొలగించండి
  3. భవ్య సుగుణశీల భారతాబాల శతకం రచయత పేరు తెలుపగలరు

    రిప్లయితొలగించండి