తెలుగు భాష నాది తెలుగు వాడను నేను
తెలుగు పలుకు మంచి తేన చినుకు
మాతృభాష కలిమి మనుగదకు చెలిమి
తెలిసి చదువు బాల తెలుగు లీల
మల్లెపూవు కంటే మంచి గంధముకంటే
పంచదార కంటే పాలకంటే
తెలుగు భాషలెస్స దేశభాషలలో సం
తెలుగు పలుకు మంచి తేన చినుకు
మాతృభాష కలిమి మనుగదకు చెలిమి
తెలిసి చదువు బాల తెలుగు లీల
మల్లెపూవు కంటే మంచి గంధముకంటే
పంచదార కంటే పాలకంటే
తెలుగు భాషలెస్స దేశభాషలలో సం
గీత భాష తెలుగజాతి భాష
వీణ తీగ మీటి వినిపించినట్లుగ
వినగసొంపు గొలుపు తెలుగు పలుకు,
తెలుగు పలుకులందు తేనెలూరుచునుండు,
భవ్య సుగుణ శీల భరత బాల.